చికెన్ పై కరోనా ఎఫెక్ట్... అదంతా ప్రచారమేనన్న కేటీఆర్
ముఖ్యమంత్రిగారింట్లో ఎవరూ అనారోగ్యంబారిన పడలేదు. మరి మీకెందుకు దిగులు? చికెన్‌వల్ల కరోనా వ్యాధి వ్యాపిస్తుందన్నది శుద్ధ అబద్ధం’ అని ఆయన పేర్కొన్నారు.
తాము రోజూ చికెన్ తింటున్నామని.. అయినా తమకు ఎలాంటి అనారోగ్యం రాలేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చికెన్, కోడిగుడ్లు తినకూడదని.. వాటికి కూడా వైరస్ లు సోకాయంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం ఊపందుకుంది.
వాటిని నిజమని నమ్ముతున్న తెలంగాణ ప్రజలు చికెన్ తినడం తగ్గించేశారు. దీంతో పౌల్ట్రీ బిజినెస్ దారుణంగా పడిపోయింది. ఈ క్రమంలో.. దీనిపై తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దీనిపై ప్రజలకు అవగాహన కల్పించారు.