Asianet News TeluguAsianet News Telugu
breaking news image

Medaram Jatara: కుటుంబసమేతంగా సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న మంత్రి తలసాని

మేడారం: దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో వైభవంగా జరుగుతోంది. 

మేడారం: దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో వైభవంగా జరుగుతోంది. ఇప్పటికే వనదేవతలంతా గద్దెలపైకి చేరుకోవడంతో దర్శనానికి సామాన్య భక్తులే కాదు రాజకీయ ప్రముుఖులు పోటెత్తుతున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అమ్మవార్లను దర్శించుకున్నారు. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కుటుంబసమేతంగా మేడారంకు చేరుకుని సమ్మక్క‌, సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తులాభారం  వేసి నిలువెత్తు బంగారం(బెల్లం) అమ్మలకు సమర్పించుకున్నారు