హైదరాబాద్ లో మునుగోడు పాలిటిక్స్... మంత్రి తలసాని కీలక సమావేశం

హైదరాబాద్ : ఉపఎన్నిక మునుగోడులో అయితే ప్రచారం హైదరాబాద్ లో జరుగుతోంది. 

First Published Oct 27, 2022, 5:04 PM IST | Last Updated Oct 27, 2022, 5:04 PM IST

హైదరాబాద్ : ఉపఎన్నిక మునుగోడులో అయితే ప్రచారం హైదరాబాద్ లో జరుగుతోంది. మునుగోడు నియోజకవర్గ ప్రజలు చాలామంది ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం హైదరాబాద్ ఎల్బీ నగర్ లో నివాసముంటున్నారు. మునుగోడు గెలుపోటములను ప్రభావితం చేసేస్థాయిలో వీరి సంఖ్య వుండటంతో ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. వీరిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఎల్బీ నగర్ పిండి పుల్లారెడ్డి గార్డెన్ లో మునుగోడు నియోజకవర్గం నాంపల్లికి చెందిన ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు. ప్రజలకు మంచిచేస్తూ సుపరిపాలన అందించే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి గెలింపించాలని మంత్రి కోరారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడమే కాదు గ్రామాలను అభివృద్ది చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ అభివృద్ది ఇలాగే కొనసాగి ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని మంత్రి తలసాని కోరారు.