సీఎం కేసీఆర్ కు ఆయనే స్పూర్తి...: మంత్రి శ్రీనివాస్ గౌడ్
బహుజన తత్వవేత్త సామాజిక దార్శనికుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే 195వ జయంతి (11ఏప్రిల్) ని పురస్కరించుకుని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...దేశానికి, సమాజానికి ఫూలే అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. వర్ణ వివక్షను రూపుమాపడం కోసం, దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం, మహాత్మాఫూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదన్నారు. కుల, లింగ వివక్షకు తావు లేకుండా విద్య, సమానత్వం ద్వారానే సామాజిక ఆర్ధిక సమున్నతికి బాటలు పడతాయనే మహాత్మా ఫూలే ఆలోచన విధానాన్నే స్పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం, సిఎం కెసిఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.