యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి మంత్రి సత్యవతి రాథోడ్ నిలువుదోపిడీ

యాదగిరిగుట్ట: నూతన సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఇవాళ యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. యాదగిరిగుట్టపై వెలిసిన లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రి తన బంగారు నగలను నిలువుదోపిడి ఇచ్చారు. స్వామి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు, అధికారులు మంత్రికి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ... దేవాలయ స్వర్ణతాపడం కోసం కేసీఆర్ పిలుపునందుకుని చాలామంది బంగారాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే తాను ప్రస్తుతం కొంత బంగారాన్ని దేవుడికి సమర్పించానని...మరికొంత బంగారాన్ని కూడా త్వరలోనే విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.  

First Published Jan 2, 2022, 4:28 PM IST | Last Updated Jan 2, 2022, 4:28 PM IST