ఇప్పుడో అవకాశం వచ్చింది.. అడవి దిశగా కదులుదాం.. సత్యవతి రాథోడ్
అటవీ జిల్లాగా పేరొందిన ములుగులో అడవులను కాపాడుకోవాలి.. సంరక్షించుకోవాలి ఇంకా పెంపొందించుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
అటవీ జిల్లాగా పేరొందిన ములుగులో అడవులను కాపాడుకోవాలి.. సంరక్షించుకోవాలి ఇంకా పెంపొందించుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు అంటేనే 75 శాతం అడవులున్న ప్రాంతం. రోడ్డు మీద నుంచి దట్టంగా కనిపించే చెట్లు, అడవి లోపల అంతగా లేవు. కాబట్టి దీనిని అభివృద్ధి చేసుకోవాలన్నారు. అడవిలో ఉన్న ఖాళీ ప్రదేశాలను దట్టమైన అడవులుగా మార్చే విధంగా హరితహారంలో బ్లాక్ ప్లాంటేషన్ చేయాలని కోరారు. భావి తరాలకు మనం ఇచ్చే గొప్ప కానుక అని సీఎం కేసిఆర్ గారు హరితహతం చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ కి మించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.