ఐటీ కంపెనీల చూపు వరంగల్ వైపు: మంత్రి సత్యవతి

వరంగల్‌కు రావడానికి ఆసక్తిచూపుతున్న ఐటీ కంపెనీలకు స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు తెలంగాణ గిరిజన సంక్షేమ, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.

First Published Feb 16, 2020, 3:03 PM IST | Last Updated Feb 16, 2020, 3:03 PM IST

వరంగల్‌కు రావడానికి ఆసక్తిచూపుతున్న ఐటీ కంపెనీలకు స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు తెలంగాణ గిరిజన సంక్షేమ, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. వరంగల్‌ నగరంలోని మడికొండ పారిశ్రామిక, ఐటీ కారిడార్‌లో ఆదివారం క్వాడ్రంట్ ఐటీ కంపెనీకి శంకుస్థాన చేశారు. ఈ సదర్భంగా సత్యవతి మాట్లాడుతూ.. అమెరికాలో స్థిరపడిన వంశీరెడ్డి తన సొంతగడ్డపై అభిమానంతో ఇక్కడకు ఐటీ కంపెనీ తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్ తర్వాత ఐటీ కంపెనీలు వరంగల్ రావడానికి ఉత్సాహంగా ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు.