50వేల ఉద్యోగాల భర్తీ... త్వరలో నోటిఫికేషన్: మంత్రి నిరంజన్ రెడ్డి

గోపాల్ పేట: తెలంగాణలో ఖాళీ అవుతున్న పట్టభద్రుల శాసనమండలి స్థానానికి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.  

First Published Mar 4, 2021, 3:43 PM IST | Last Updated Mar 4, 2021, 3:43 PM IST

గోపాల్ పేట: తెలంగాణలో ఖాళీ అవుతున్న పట్టభద్రుల శాసనమండలి స్థానానికి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.  ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ గోపాల్ పేట మండలకేంద్రంలో పట్టభద్రులతో జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... లక్షా 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని, మరో 50 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా ఆరేళ్లలో లక్షా 50 వేల ఉద్యోగాలు కల్పించారా? అని నిలదీశారు. నాలుగుకోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో లక్షా 50 వేల ఉద్యోగాలు ఇస్తే మరి మిగతా రాష్ట్రాలలో జనాభా ప్రాతిపదికన ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి? అని ప్రశ్నించారు. బీజేపీ పాలిస్తున్న 21 రాష్ట్రాలలో ఎక్కడైనా ఉద్యోగాలు కల్పించారా ? అని వారిని ప్రశ్నించండని పట్టభద్రులకు సూచించారు. ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేది తెలంగాణ ప్రభుత్వమే...- పనిచేసే ప్రభుత్వానికి ఓటేయండి .. విపక్షాల దుష్ప్రచారం నమ్మొద్దని మంత్రి కోరారు.