రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్క్‌ను సందర్శించిన కేటిఆర్
జూబ్లీహిల్స్‌లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పైన చైతన్యం కలిగించేలా ఏర్పాటు చేసిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్క్ ను మంత్రి కేటిఆర్ సందర్శించారు.
జూబ్లీహిల్స్‌లో విద్యార్థులు, ప్రజల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పైన చైతన్యం కలిగించేలా ఏర్పాటు చేసిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్క్ ను మంత్రి కేటిఆర్ సందర్శించారు . థీమ్ పార్క్ లో ఏర్పాటు చేసిన దాదాపు 42 నీటి సంరక్షణ పద్దతులను అధికారులు మంత్రికి వివరించారు. వాటర్ హార్వెస్టింగ్ కార్యక్రమాన్నిపెద్ద ఎత్తున చేపట్టేందుకు తగిన కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ అధికారులకు సూచించారు. ప్రజల్లో వర్షాకాలానికి ముందే చైతన్యం తీసుకువచ్చేందుకు ఇదే సరైన సమయమని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా జలమండలి యూనిఫామ్ జాకెట్, తాగునీటి కొరత, వాన నీటి సంరక్షణ కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించిన రిజిస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు . అనంతరం జలమండలి ఆధ్వర్యంలో నడుస్తున్న పలు ప్రాజెక్టులు, కార్యక్రమాలపై కేటీఆర్ సమీక్ష నిర్వహించారు .