కరీంనగర్ లో కేటీఆర్ పర్యటన... బైక్ ర్యాలీలు, పార్టీ జెండాలతో టీఆర్ఎస్ శ్రేణుల సందడి

కరీంనగర్: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. 

First Published Mar 17, 2022, 2:44 PM IST | Last Updated Mar 17, 2022, 2:44 PM IST

కరీంనగర్: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుండి కరీంనగర్ కు బయలుదేరిన మంత్రికి తిమ్మాపూర్ మండలం రేణుకుంట టోల్ ప్లాజా వద్ద టీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ క్రమంలో రేణుకుంటలో ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన టీఆర్ఎస్ కార్యకర్త గోనెల నర్సయ్య కుటుంబాన్ని  కేటీఆర్ పరామర్శించి కుటుంబసభ్యులకు రూ.2 లక్షల భీమా చెక్కును అందజేసారు. ఆ తర్వాత రేణుకుంట నుండి అలుగునూర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వివిధ అభివ‌ృద్ది, ప్రజా సంక్షేమ పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కేటీఆర్ వెంట మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో పాటు జిల్లా టీఆర్ఎస్ నాయకులు వున్నారు.