సిరిసిల్ల జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటిఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా ఐటీ, పురపాకల శాఖ మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థానలు, ప్రారంభోత్సవాలతో చాల బిజీ బిజీగ గడిపారు .
రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా ఐటీ, పురపాకల శాఖ మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థానలు, ప్రారంభోత్సవాలతో చాల బిజీ బిజీగ గడిపారు .రూ.5.15కోట్లతో సిరిసిల్ల పట్టణంలోఅధునాతన రైతు బజార్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మార్కెట్ లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించారు. మంత్రి మాట్లాడుతూ ఇతర జిల్లాలకు ఆదర్శవంతంగా సిరిసిల్లలో అభివృద్ధి జరుగుతున్నదన్నారు. రైతులకు రైతుబంధు, రైతుబీమా అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ , వ్యవసాయ రంగానికి మహర్ద దశ పట్టనుందని, విదేశాలకు చేపలు, రొయ్యలు ఎగుమతి చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. రైతును రాజును చేయడమే ప్రభుత్వ సంకల్పమన్నారు .