సరికొత్త పంథాలో హస్తినకు కేసీఆర్ అడుగులు... బిఆర్ఎస్ వల్లే అది సాధ్యం..: జగదీష్ రెడ్డి
సూర్యాపేట : భారత రాష్ట్ర సమితి పార్టీ నలుగురు ముఖ్యమంత్రులతో నిర్వహించిన ఖమ్మం బహిరంగ సభ సక్సెస్ తో దేశ రాజకీయాల్లో పెనుమార్పులు ఖాయమని తేలిపోయిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
సూర్యాపేట : భారత రాష్ట్ర సమితి పార్టీ నలుగురు ముఖ్యమంత్రులతో నిర్వహించిన ఖమ్మం బహిరంగ సభ సక్సెస్ తో దేశ రాజకీయాల్లో పెనుమార్పులు ఖాయమని తేలిపోయిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త పంథాలో హస్తినకు అడుగులు వేస్తున్నారని... 2024 నుండి దేశంలో సరికొత్త శకం ప్రారంభమవుతుందని అన్నారు. కాంగ్రెస్, బిజెపి పాలనలో దేశం గాడాంధకారంలోకి జారుకుందని... ఆ కారుచీకట్లను తొలగించేందుకే బిఆర్ఎస్ ఆవిర్భావం జరిగిందన్పారు. ప్రస్తుతం దేశం గడ్డు పరిస్థితులకు ఎదుర్కుంటోందని... వీటి నుండి దేశాన్ని బయటపడేసేది బిఆర్ఎస్ అని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.