ఎమ్మెల్యే మదన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి హరీశ్ రావు
సికింద్రాబాద్ (secunderabad)లోని సన్ షైన్ హస్పిటల్ (Sunshine Hospital) లో మోకాలిశస్త్ర చికిత్స చేయించుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి (Narsapur MLA Madan Reddy) ని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (minister harish rao) శనివారం పరామర్శించారు.
సికింద్రాబాద్ (secunderabad)లోని సన్ షైన్ హస్పిటల్ (Sunshine Hospital) లో మోకాలిశస్త్ర చికిత్స చేయించుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి (Narsapur MLA Madan Reddy) ని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (minister harish rao) శనివారం పరామర్శించారు. మోకాలి ఆపరేషన్ అనంతరం మదన్ రెడ్డికి అందుతున్న వైద్య సేవల వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మంచి వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని మంత్రి హరీశ్ రావు ఆకాంక్షించారు. కొంత సమయం వరకు ఎమ్మెల్యేతో మంత్రి ముచ్చటించారు. ఆయన ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి హరీశ్ రావు వెంట టీఆర్ఎస్ నాయకులు (TRS leaders) ఉన్నారు.