Asianet News TeluguAsianet News Telugu

కొండాపూర్ హాస్పిటల్లో మంత్రి హరీష్ ఆకస్మిక తనిఖీ... లంచాల డాక్టర్ పై అక్కడిక్కడే సస్పెన్షన్ వేటు

హైదరాబాద్: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాస్పత్రుల్లో సదుపాయాలు మెరుగుపర్చి సామాన్యులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు

హైదరాబాద్: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాస్పత్రుల్లో సదుపాయాలు మెరుగుపర్చి సామాన్యులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సామాన్యులను లంచాల పేరుతో ఇబ్బంది పెడుతున్న ఓ డాక్టర్ పై మంత్రికి ఫిర్యాదు అందింది. ఇంకేముంది వెంటనే సదరు హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీ చేపట్టిన మంత్రి అక్కడికక్కడే డాక్టర్ ను సస్పెండ్ చేసారు. డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం కొండాపూర్ ఏరియా హాస్పిటల్ డాక్టర్ మూర్తి డబ్బులు అడిగారని బాధితుల మంత్రి హరీష్ రావుకు ఫిర్యాదు చేసారు. దీంతో మంత్రి ఈ అవినీతి డాక్టర్ పనిచేసే ఆసుపత్రిని ఆకస్మిక సందర్శించి వివరాలు అడిగి తెల్సుకున్నారు. డాక్టర్ మూర్తి అవినీతికి పాల్పడినట్లు తేలడంతో అక్కడిక్కడే సస్పెన్షన్ వేటు వేసారు మంత్రి. ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని మిగతా డాక్టర్లు, సిబ్బందికి మంత్రి హరీష్ హెచ్చరించారు.