కోరుట్లలో బస్తీ దవాఖానా, డయాలసిస్ సెంటర్ ప్రారంభించిన మంత్రి హరీష్...
జగిత్యాల జిల్లా కోరుట్లలో వైద్యారోగ్య శాఖకు సంబంధించిన కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.
జగిత్యాల జిల్లా కోరుట్లలో వైద్యారోగ్య శాఖకు సంబంధించిన కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ను, పట్టణంలోని హజీపుర లో బస్తీ దవాఖానాను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, కలెక్టర్ రవి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ... కోరుట్ల ప్రభుత్వాస్పత్రిని మరింత అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 30 పడకల ఆసుపత్రినీ రూ.20 కోట్లతో వంద పడకలుగా మార్చనున్నట్లు... ఈ పనులకు కూడా శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో మూడే డయాలసిస్ సెంటర్లుండగా ఇప్పుడు 122 చేశామన్నారు. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ ఒక డయాలసిస్ సెంటర్ తెచ్చామన్నారు. తెలంగాణలో 200 ఉన్న ఐసియు బెడ్ లను 6000 లకు పెంచామన్నారు.