ఎక్కడి వెళ్లాలమ్మ..పాస్ లున్నాయా...ఆరాతీసిన హరీశ్ రావు
మంత్రి హరీష్ రావు మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు.
మంత్రి హరీష్ రావు మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. హైదరాబాద్ నుండి సిద్దిపేటకు వెళ్తున్న మంత్రి హరీష్ రావు శామీర్ పేట్ వద్ద జనాలు గుంపుగా కనిపించడంతో కారు ఆపారు. వారిని ఎక్కడికి వెళ్ళాలమ్మ, వాహనాలు ఉన్నాయా, ఎం ఇబ్బంది అని ఆరాతీశారు. పోలీసులు వెళ్లనివ్వడంలేదని చెప్పడంతో పాస్ లు, వాహనాలున్నప్పుడు ఆపి ఇబ్బంది పెట్టకండని చెప్పి పోలీసులను మందలించారు. దీంతో అక్కడున్న ప్రయాణికులు హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు..