పటాన్ చెరులో ఇళ్ల పట్టాలు పంపిణీచేసిన మంత్రి హరీష్ రావు...
సంగారెడ్డి : హైదరాబాద్ శివారులోని పారిశ్రామిక ప్రాంతమైన పటాన్ చెరు నియోజకవర్గంలో ఇళ్లపట్టాలను పంపిణీచేసారు ఆర్థిక మంత్రి హరీష్ రావు.
సంగారెడ్డి : హైదరాబాద్ శివారులోని పారిశ్రామిక ప్రాంతమైన పటాన్ చెరు నియోజకవర్గంలో ఇళ్లపట్టాలను పంపిణీచేసారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. నియోజవకర్గానికి చెందిన 738 మంది లబ్దిదారులకు జీవో 58 కింద ఇళ్లపట్టాలు పంపిణీ చేసారు. జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, టిఎస్ ఎంఐడసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ శరత్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గోన్నారు. .
ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందించిన నియోజకవర్గం పటాన్ చెరు అని అన్నారు. ఒక్క రూపాయి ఖచు లేకుండా పూర్తి పారదర్శకతతో పట్టాలు పంపిణీ చేస్తున్నామని... ఇందుకుగాను జిల్లా, మండల స్థాయి అధికారులకు అభినందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాబోయే నెల రోజుల్లో జివో నెంబర్ 59 ద్వారా ఇళ్ల పట్టాలు అందిస్తామని మంత్రి హరీష్ ప్రకటించారు.