రంగంలోకి టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్... మునుగోడులో తనదైన స్టైల్లో హరీష్ ప్రచారం

నల్గొండ : మునుగోడు ఉపఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్నకొద్దీ ప్రధాన పార్టీల ప్రచారం మరింత జోరందుకుంటోంది.

First Published Oct 19, 2022, 1:15 PM IST | Last Updated Oct 19, 2022, 1:15 PM IST

నల్గొండ : మునుగోడు ఉపఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్నకొద్దీ ప్రధాన పార్టీల ప్రచారం మరింత జోరందుకుంటోంది. ఇలా అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రచార జోరును పెంచి ట్రబుల్ షూటర్ హరీష్ రావును రంగంలోకి దింపింది. సామాన్యులలో సామాన్యుడిలా మెలుగుతూ ప్రజల్లో ఇట్టే కలిసిపోతూ మంత్రి హరీష్ మునుగోడు ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా రోడ్డుపైనే టిఫిన్ చేస్తూ మహిళలతో ముచ్చటించి సమస్యలు తెలుసుకున్నారు. ఇలా తనదైన స్టైల్లో మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ రాజ్ పేట తండాలో ప్రచారం నిర్వహిస్తున్నారు హరీష్ రావు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా హరీష్ మాట్లాడుతూ బిజెపి పై, ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. బిజెపి గెలిస్తే పెన్షన్ రూ.3000 చేస్తామంటున్నారు... కానీ ప్రస్తుతం బిజెపి అధికారంలో వున్న ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్ లో ఇస్తున్నది రూ.700, పక్కరాష్ట్రం కర్ణాటకలో ఇస్తున్నది రూ.600 పెన్షనే అని గుర్తుచేసారు. వీరు తెలంగాణలో అధికారంలోకి వస్తే పెన్షన్లు పెంచుతామనడం కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజుల చేపిస్తా అన్నట్లుగా వుంటుందని మంత్రి ఎద్దేవా చేసారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముందు రూ.3000 పెన్షన్ ఇచ్చి తెలంగాణకి వచ్చి మాట్లాడాలని హరీష్ సూచించారు.