తెలంగాణకు తండ్రిలాంటి కేసీఆర్ చాలు... కోడలు షర్మిల ఎందుకు?: గంగుల
కరీంనగర్: నిన్న(గురువారం) తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది బడుగు బలహీన వర్గాల బడ్జెట్ అని...
కరీంనగర్: నిన్న(గురువారం) తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది బడుగు బలహీన వర్గాల బడ్జెట్ అని... కరోనా సంక్షోభంలో సైతం సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేశారని మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. కేసీఆర్ మీద అభిమానం పట్టభద్రులకు చెక్కు చెదరలేదని ఎంఎల్సి ఎన్నికలు నిరూపించాయన్నారు. వరంగల్ లో బీజేపీ నాలుగో స్థానానికి పరిమితమైందన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో సైతం టిఆర్ఎస్ గెలుస్తుందని గంగుల ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు సీఎం కేసీఆర్ అనే తండ్రి ఉన్నాడు... కోడలు షర్మిల అవసరం లేదన్నారు. షర్మిల తెలంగాణ కొడలైతే బలవంతంగా ఆంధ్రాలో కలిపిన ఏడు మండలాలను తెలంగాణకు తిరిగి ఇప్పియ్యాలన్నారు. ఏడు మండలాల కోసం షర్మిల పాదయాత్ర చేస్తే తెలంగాణ కొడలని నమ్ముతామన్నారు గంగుల.