కరీంనగర్ జిల్లాలో తొలి దాన్యం కొనుగోలు కేంద్రం... ప్రారంభించిన మంత్రి గంగుల
యాసంగి ధాన్యం సేకరణ కోసం కరీంనగర్ జిల్లాలో తొలి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.
యాసంగి ధాన్యం సేకరణ కోసం కరీంనగర్ జిల్లాలో తొలి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. చెర్లబూత్కూరులో ప్యాక్ అనుభందంగా నూతన వరి దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...45 రోజుల్లో రాష్ట్రం మెత్తం 6400కు పైగా కొనుగోలు కేంద్రాల ద్వారా దాదాపు కోటి 32 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యాన్ని సేకరిస్తామన్నారు. గతంలో చెర్లబూత్కూరులో 17వేల క్వింటాళ్ల దాన్యం ఈ సెంటర్ ద్వారా కొనుగోలు జరిగిందన్నారు. కాళేశ్వరం జలాల ద్వారా ఎస్ఆర్ఎస్పీ 11ఆర్ కింద చెర్ల బూత్కూరుకి సమ్రుద్దిగా నీరు అందడం, నిరంతరాయ కరెంట్ వల్ల ఈ యాసంగిలో దాదాపు 20వేల క్వింటాళ్ల పైచిలుకు దిగుబడికి అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రైతులు పండించే ప్రతి గింజను సేకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.