గతేడాది సరిగ్గా ఇదే రోజు... తెలంగాణలో తొలి కరోనా కేసు: ఈటల
హైదరాబాద్: గతేడాది దుబాయ్ నుండి రాష్ట్రానికి తొలి కరోన కేసు ఇదేరోజున వచ్చిందని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.
హైదరాబాద్: గతేడాది దుబాయ్ నుండి రాష్ట్రానికి తొలి కరోన కేసు ఇదేరోజున వచ్చిందని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఆనాడు అనేక రకాల సందేహాలు, అనుమానాలు ఉన్నపట్టికి ప్రాణాలను తెగించి గాంధీ హాస్పిటల్ సిబ్బంది ఆత్మ విశ్వాసంతో పని చేశారని ఈటల అన్నారు.
ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఈటల గాంధీ హాస్పిటల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 35 వేలకు పైగా కోవిడ్ పేషెంట్స్ గాంధీలో చికిత్స పొందారన్నారు. 7 వేల మందికి పైగా అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నవారికి చికిత్స అందించినట్లు... అత్యధికంగా కోవిడ్ పేషెంట్స్ డెలివరీ ఇక్కడే జరిగిందన్నారు. 7వేల కిడ్నీ పేషెంట్స్ డయాలసిస్ ఇక్కడ చేశామన్నారు. గాంధీ హాస్పిటల్ డాక్టర్స్, సిబ్బంది ప్రాణాలకు తెగించి తమ కర్తవ్యం నిర్వహించారన్నారు. వారి సేవలను గుర్తించి సన్మానం కూడా చేస్తున్నామన్నారు ఈటల.