Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్ వెసులు బాటును దుర్వినియోగం చేస్తే కరోనా రెచ్చిపోతుంది.. ఎర్రబెల్లి దయాకర్ రావు..

లాక్ డౌన్ వెసులు బాటుని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయ‌వ‌ద్ద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. 

లాక్ డౌన్ వెసులు బాటుని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయ‌వ‌ద్ద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. లాక్ డౌన్ నేప‌థ్యంలో గురువారం హైద‌రాబాద్ లోని త‌న ఇంట్లో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మంత్రి ఉత్సాహంగా, ఉల్లాసంగా క్యార‌మ్స్ ఆడారు.ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ, ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు కావొద్ద‌నే ఉద్దేశ్యంతోనే సీఎం కెసిఆర్ గ్రీన్, ఆరెంజ్ జోన్లు ఉన్న ప్రాంతాల్లో ప్ర‌ధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వెసులు బాటు ఇచ్చార‌న్నారు. క‌రోనా క‌ట్ట‌డికి మ‌రికొంత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని, ఈ లోగా మ‌న‌కు మ‌నం క‌రోనా వైర‌స్ విస్తృతికి కార‌ణం కారాద‌ని మంత్రి అన్నారు. ప్ర‌జలు స్వీయ నియంత్ర‌ణ‌ని పాటించాల‌ని, కుటుంబ స‌భ్యుల‌తో హాయిగా గ‌డ‌పాల‌ని సూచించారు. రెడ్ జోన్ల ప్ర‌జ‌లు పూర్తి లాక్ డౌన్ పాటిస్తూ, అధికారులు, పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌న్నారు.