బిజెపి కుట్రలకు బలికాకండి... హిందూ-ముస్లింలు ఎప్పటికీ అన్నదమ్ములే: మంత్రి ఎర్రబెల్లి

వరంగల్: హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టడం బీజేపీ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.  

First Published May 3, 2022, 3:14 PM IST | Last Updated May 3, 2022, 3:14 PM IST

వరంగల్: హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టడం బీజేపీ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.  రంజాన్ పర్వదినం సందర్భంగా  మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో ముస్లిం సోదరులతో కలిసి మసీదులో ప్రార్థనలు చేశారు మంత్రి ఎర్రబెల్లి. అనంతరం దుబ్బ తండాలో దుర్గమ్మ గుడి నిర్మాణానికి భూమి పూజ చేసారు మంత్రి.  ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... దేశంలో బీజేపీ అధికార దాహంతో ప్రజలను మతాల పేరుతో విడదీసి చిచ్చుపెట్టి పరిపాలన సాగిస్తోంది అని అన్నారు. బిజెపి కుట్రలకు, మత విద్వేషాలకు ప్రజలు బలి కావద్దని ఆయన చెప్పారు. దేశంలో దశాబ్దాలుగా కలిసిన ఉన్న విధంగానే హిందూ ముస్లింలము అన్నదమ్ముల్లా కలిసి ఉందామని మంత్రి అన్నారు. మసీదు అభివృద్ధి కోసం 10 లక్షల రూపాయలతో పలు కార్యక్రమాలను చేపడతామని ముస్లిం సోదరుల చప్పట్ల మధ్య మంత్రి ఎర్రబెల్లి ప్రకటించారు.