గిరిజన మహిళలతో కలిసి స్టెప్పులేసిన మంత్రి ఎర్రబెల్లి

వరంగల్: మంత్రి పదవిలో వున్నప్పటికి ఎలాంటి అధాకార దర్పాన్ని ప్రదర్శించకుండా సామాన్య ప్రజలతో ఇట్టే కలిసిపోతుంటారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. 

First Published Mar 17, 2022, 10:18 PM IST | Last Updated Mar 17, 2022, 10:18 PM IST

వరంగల్: మంత్రి పదవిలో వున్నప్పటికి ఎలాంటి అధాకార దర్పాన్ని ప్రదర్శించకుండా సామాన్య ప్రజలతో ఇట్టే కలిసిపోతుంటారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. ఇలాగే తాజాగా హోలీ పండగ సందర్బంగా సంబరాలు చేసుకుంటున్న గిరిజన మహిళలతో మమేకమయ్యారు మంత్రి. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో కడవెండి-పొట్టిగుట్ట శివారులోని వానకొండయ్య శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలకు హాజరయ్యేందుకు వెళుతుండగా మార్గమధ్యలో మంత్రి ఎర్రబెల్లికి లంబాడా గిరిజన మహిళలు హోలీ ఆడుతూ కనిపించారు. దీంతో వెంటనే తన వాహనశ్రేణిని ఆపి మహిళలతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. గిరిజన మహిళలతో కలిసి నృత్యాలు చేయడమే కాదు కోలాటం కూడా ఆడారు మంత్రి ఎర్రబెల్లి.