తెలంగాణ మూడోదశ కరోనా వ్యాక్సినేషన్...మొదటి టీకా మంత్రి ఈటలకే

మూడవ దశ వాక్సినేషన్ లో భాగంగా ఈ రోజు హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారబించారు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్.

First Published Mar 1, 2021, 1:55 PM IST | Last Updated Mar 1, 2021, 1:55 PM IST

మూడవ దశ వాక్సినేషన్ లో భాగంగా ఈ రోజు హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారబించారు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. అంతేకాకుండా మొదటి వాక్సిన్ కూడా మంత్రే వేసుకుని ప్రజలకు వ్యాక్సిన్ పట్ల వున్న అపోహలను పటాపంచలు చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక, తెలంగాణ రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్ లో పనిచేస్తున్న సిబ్బందికి వాక్సిన్ ఇచ్చామన్నారు. రెండవ దశలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ వాక్సిన్ ఇచ్చామని... ఈ రోజు నుండి 60 సంవత్సరాల వయసు పైబడిన వారికి, 45 సంవత్సరాలు పైబడి ఇతర జబ్బులతో బాధ పడుతున్నారు వారికి వాక్సిన్ ఇస్తున్నామని తెలిపారు.  ప్రజలందరూ భయపడకుండా ముందుకు వచ్చి వాక్సిన్ తీసుకోవాలని.... ప్రతి ఒక్కరికీ వాక్సిన్ అందుతుంది, తొందరపడకుండా అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనివైద్య ఆరోగ్యశాఖ మంత్రి విజ్ఞప్తి చేశారు.