కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్: మంత్రి గంగుల కమలాకర్ ఇవాళ(సోమవారం) కరోనా వాక్సిన్ తీసుకున్నారు.
కరీంనగర్: మంత్రి గంగుల కమలాకర్ ఇవాళ(సోమవారం) కరోనా వాక్సిన్ తీసుకున్నారు. కరీంనగర్ ఆర్టీసీ వర్క్ షాప్ ఆస్పత్రిలోని వాక్సినేషన్ కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి వైద్యులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మొదటి డోస్ టీకా తీసుకున్నారు. కరోనా వాక్సినేషన్ పట్ల ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని మంత్రి గంగుల సూచించారు. కరోనా వ్యాక్సిన్
నూటికి నూరు శాతం సురక్షితమైనదే కాక వైరస్ ఉదృతి నుండి ఖచ్చితంగా బయటపడేస్తుందని మంత్రి భరోసానిచ్చారు.