ఆత్మహత్యాయత్నానికి ముందు తల్లితో ప్రీతి మాటలివే... ఫోన్ రికార్డింగ్ లో సంచలనాలు
వరంగల్ : వరంగల్ ఎంజిఎంలో మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
వరంగల్ : వరంగల్ ఎంజిఎంలో మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. సీనియర్ సైఫ్ వేధింపులే ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారణంగా తెలుస్తోంది. సైఫ్ వేధింపుల గురించి ఆత్మహత్యాయత్నానికి ముందు ప్రీతి తల్లితో మాట్లాడిన ఫోన్ సంభాషణ రికార్డింగ్ తాజాగా బయటకు వచ్చింది. తనతో పాటు చాలామంది జూనియర్లను సైఫ్ వేధిస్తున్నాడని... కానీ ఎవరూ బయటపెట్టడం లేదని ప్రీతి తల్లికి తెలిపింది. సీనియర్లంతా ఒక్కటిగా వున్నారని... సైఫ్ పై ఫిర్యాదుచేస్తే ఎక్కడ టార్గెట్ చేస్తారోనని అందరూ భయపడుతున్నారని ప్రీతి మాటలద్వారా తెలుస్తోంది. అయితే ఇప్పటికే సైఫ్ పై ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసిన విషయాన్ని ప్రీతి తల్లికి వివరించింది. దీంతో హెచ్ఓడీ తనను పిలిచి మాట్లాడారని... సైఫ్ తోనూ ఏదో మాట్లాడినట్లుగా ప్రీతి తల్లికి తెలిపింది. తన బాధను చెప్పుకుంటూ ఆందోళన చెందుతున్న ప్రీతికి తల్లి ధైర్యం చెప్పే ప్రయత్నంచేసింది.