సిరిసిల్ల జిల్లాలో నక్సల్స్ కదలికలపై ప్రచారం... క్లారిటీ ఇచ్చిన ఎస్పీ రాహుల్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జనశక్తి నక్సలైట్ల కదలికలపై పలు వార్తలు సోషల్ మీడియాతో పాటు కొన్ని వార్తా ఛానెళ్లలో వస్తున్న నేపథ్యంలో ఎస్పీ రాహుల్ హెగ్డే స్పందించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జనశక్తి నక్సలైట్ల కదలికలపై పలు వార్తలు సోషల్ మీడియాతో పాటు కొన్ని వార్తా ఛానెళ్లలో వస్తున్న నేపథ్యంలో ఎస్పీ రాహుల్ హెగ్డే స్పందించారు. ఈ వార్తలను ఖండించిన ఆయన జిల్లాలో జనశక్తి నక్సలైట్ మూమెంట్ లేదని స్పష్టం చేసారు. ప్రజలు ఆందోళనతో భయపడిపోవద్దని సూచించారు. ఎవరికయినా నక్సల్స్ కదలికలపై పక్కా సమాచారం ఉంటే దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. జనశక్తి నక్సలైట్ పేరుమీద ఎవరైనా ఫోన్ కాల్ చేసి బెదిరించినా తమకు సమాచారం అందివ్వాలని... వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాహుల్ హెగ్డే హెచ్చరించారు.