ఎన్ని సార్లని చలాన్లు కట్టాలి.. బైక్‌కు నిప్పు పెట్టిన వాహనదారుడు (వీడియో)
ట్రాఫిక్ పోలీసులు (traffic police) చలాన్ల (challans) పేరుతో వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ (adilabad) జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల చలాన్ల బాధలు భరించలేక ఓ వ్యక్తి తన మోటార్ సైకిల్‌కు నిప్పు (fire) పెట్టాడు.
ట్రాఫిక్ పోలీసులు (traffic police) చలాన్ల (challans) పేరుతో వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా ఝులిపిస్తున్న పోలీసులు నిబంధనలు పాటించిన వారిపైనా చలాన్లు విధించడం విమర్శలకు తావిస్తోంది. ట్రాఫిక్ పోలీసులు అప్పుడప్పుడు ఓవరాక్షన్‌కు సంబంధించిన ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఆదిలాబాద్ (adilabad) జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల చలాన్ల బాధలు భరించలేక ఓ వ్యక్తి తన మోటార్ సైకిల్‌కు నిప్పు (fire) పెట్టాడు. స్థానిక పంజాబ్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఖానాపూర్‌కు చెందిన మక్బూల్ అనే వ్యక్తి తన బైక్‌కు నిప్పు పెట్టడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. చలాన్లు కట్టినా కూడా తరుచూ కట్టాలని ట్రాఫిక్ పోలీసులు వేధిస్తున్నారని..వీటిని తట్టుకోలేకే తన బైక్‌కు నిప్పు పెట్టినట్లు మక్బూల్ పేర్కొన్నారు.