దారుణం.. పాత కక్షలతో యువకుడిపై దాడి.. పరిస్థితి విషమం..
పాత కక్షలతో కొంతమంది వ్యక్తులు ఓ యువకుడిపై దాడి చేసి గాయపరిచిన ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది.
పాత కక్షలతో కొంతమంది వ్యక్తులు ఓ యువకుడిపై దాడి చేసి గాయపరిచిన ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని ద్వారకా నగర్ కు చెందిన వంశీకృష్ణపై అదే కాలనీకి చెందిన కొంతమంది దాడి చేశారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇరువర్గాల మధ్య ఉన్న విభేదాలే ఈ దాడికి కారణమని పోలీసులు అంటున్నారు. తీవ్ర గాయాలపాలైన వంశీకృష్ణ ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. సీసీ కెమెరాల్లో దాడి సంఘటన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.