Asianet News TeluguAsianet News Telugu

మల్లు వర్సెస్ భట్టి... కాంగ్రెస్ లో ఎవరిది పైచేయి..?

తెలంగాణ పార్టీ వ్యవహారాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అత్యంత శ్రద్ధతో, జాగరూకతతో వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోంది. 

తెలంగాణ పార్టీ వ్యవహారాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అత్యంత శ్రద్ధతో, జాగరూకతతో వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన గమనిస్తున్నట్లు స్పష్టమవుతోంది. తెలంగాణలో పార్టీని గట్టెక్కించే ఉద్దేశంతో తెలంగాణ పార్టీ నాయకులను కూడా దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ నాయకులు ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించడానికి చేస్తున్న అంతర్గత రాజకీయాలను కూడా ఆయన గమనిస్తూ దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు. సిఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఉదంతమే అందుకు తాజా ఉదాహరణ.