రోడ్డు ప్రమాదాలు లేని తెలంగాణే లక్ష్యం...: అడిషనల్ డిజిపి సందీప్ శాండిల్య

కరీంనగర్: నిరంతరం రక్షణ చర్యలు కొనసాగించడం ద్వారానే రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించవచ్చని రాష్ట్ర రోడ్డు భద్రత విభాగం ఆడిషనల్ డిజిపి సందీప్ శాండిల్య అన్నారు. రాష్ట్రంలో గత సంవత్సర కాలం నుండి 500 ప్రమాదాలను నియంత్రించామని పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్, రామగుండం కమిషనరేట్లు, సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట జిల్లాలకు చెందిన పోలీసు అధికారులతో సందీప్ శాండిల్య సమావేశం నిర్వహించారు. రోడ్డు నియమ నిబంధనలు పాటించక పోవడం వల్లనే ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని... ఈ విషయాన్ని వాహనదారులు గుర్తించాలని శాండిల్య సూచించారు. రహదారి భద్రత - మనందరి బాధ్యత పేరిట రూపొందించిన ఫ్లెక్సీలు, బ్యానర్లను ఆవిష్కరించారు.
 
First Published Mar 31, 2022, 10:00 AM IST | Last Updated Mar 31, 2022, 10:00 AM IST