సూర్యగ్రహణం ఎఫెక్ట్ ... తెలంగాణలో మూతపడ్డ యాదాద్రి, చిలుకూరు దేవాలయాలు
హైదరాబాద్ : నేడు (మంగళవారం) సూర్యగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలన్ని మూతపడ్డాయి.
హైదరాబాద్ : నేడు (మంగళవారం) సూర్యగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలన్ని మూతపడ్డాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుమల, శ్రీశైలం, విజయవాడ దుర్గమ్మ ఆలయాలతో పాటు తెలంగాణలోని యాదాద్రి, వేములవాడ, చిలుకూరు బాలాజీ ఆలయాలను గ్రహణం సందర్భంగా ఇప్పటికే మూసివేసారు. అన్ని ఆలయాల్లో నిత్యం జరిగే పూజలు, కార్యక్రమాలను రద్దు చేసారు. కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం కారణంగా ప్రధానాలయాలతో పాటు చిన్న చిన్న ఆలయాలు కూడా మూతపడ్డాయి. తెలంగాణలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ గర్భగుడి తలుపులను ఉదయం 8.50 గంటలకు అర్చకులు మూసివేసారు. తిరిగి రేపు (బుధవారం) ఉదయం ఎనిమిది గంటలకు ఈ తలుపులు తెరవనున్నారు. అలాగే హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని కూడా అర్చకులు మూసివేసారు. ఏపీలోని మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయాన్ని కూడా ఉదయమే అర్చకులు మూసివేసారు.