భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లో రోడ్డు పైనే ప్రేమ వివాహం చేసుకున్న జంట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లో సినిమా స్టైల్ లో వివాహం జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లో సినిమా స్టైల్ లో వివాహం జరిగింది. .బెదిరింపులు, చేజింగ్ లు,బుజ్జగింపులు చివరికి పోలీస్ ఒత్తిడిలను చేధించి నాటకీయంగా ప్రేమ వివాహం చేసుకుంది జంట .వివరాలలోకి వెళ్తే రాఖీ పండుగ రోజు మిస్ అయిన యువతి ప్రియుడి తో ప్రత్యక్షమైనది.బూర్గంపాడు కు చెందిన పుట్టి ఘాన్సీ రాఖీ పండుగ రోజు కొత్తగూడెం లో రాఖీ కట్టేందుకు వచ్చింది. అనంతరం కనబడకుండా పోయింది . కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేసారు కుటుంబ సభ్యులు . కుటుంబసభ్యులు , పోలీసుల అరా తీయగా ఖమ్మం కు చెందిన చేకూరి నాగార్జున తో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తెలిసింది .కుటుంబ సభ్యులు బుజ్జగింపులు చేసారు కుదరక పోవడంతో బెదిరింపులతో అమ్మాయిని దారికి తెచ్చే ప్రయత్నం చేసారు .కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వేధికగా జరుగుతున్నా ఈ ఘటనను తెలుసుకున్న మహిళా సంఘాలు స్టేషన్ చేరుకోవటంతో పోలీసులకి , మహిళా ప్రతినిధుల మధ్య వాగ్వాఢమ్ జరిగింది . ఇద్దరు మేజర్ లు అవడంతో పోలీస్ స్టేషన్ బయట మహిళా ప్రతినిధులు, మీడియా రక్షణ లో రోడ్డు పైనే వివాహం జరిపించి ఇద్దరినీ ఒకటి చేసారు