పెద్దలు ఒప్పుకోరేమోనని అనుమానం.. ప్రేమజంట ఆత్మహత్య..

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య గ్రామంలో విషాదాన్ని నింపింది.

First Published Jul 8, 2020, 12:44 PM IST | Last Updated Jul 8, 2020, 12:44 PM IST

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య గ్రామంలో విషాదాన్ని నింపింది. ఇబ్రహీం పట్నంకు చెందిన ప్రణిత్, అదే గ్రామానికి చెందిన గుండేటి రమ్య కొంతకాలంగా  ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి కులాలు వేరుకావడంతో పెద్దలకు ఈ విషయాన్ని చెప్పలేదు. చెబితే ఒప్పుకోరని భయపడిన ప్రేమజంట చనిపోవాలని నిర్ణయించుకున్నారు. సోమవారం రాత్రి 7గంటల సమయంలో గ్రామశివార్లోకి వెళ్లి పురుగుల మందు తాగారు. తర్వాత ప్రణిత్ చెట్టుకు ఉరేసుకోగా, భయపడ్డ రమ్య ఇంటికి వెళ్లిపోయింది. అయితే  పురుగుల మందుతాగడంతో రాత్రి 3గంటల సమయంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.  కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.