లారీ టైరు కింద ఇరుక్కుపోయి.. ప్రాణాలు కోల్పోయిన హమాలీ...
పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సుగ్లంపల్లి వద్ద లారీ ఢీకొని హమాలి కార్మికుడు కలవేణి కనకయ్య మృతి చెందాడు.
పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సుగ్లంపల్లి వద్ద లారీ ఢీకొని హమాలి కార్మికుడు కలవేణి కనకయ్య మృతి చెందాడు. సుల్తానాబాద్ సిఐ గట్టు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి వైపు వెళ్తున్న కారు, కారు వెనుక లారీ వేగంగా వస్తున్నాయి. సుగ్లంపల్లి వద్ద కారు ఒక్కసారి యూటర్న్ తీసుకునే సరికి లారీ అదుపుతప్పి నిలబడి ఉన్న కళవేణి కనకయ్య మీదికి దూసుకెళ్లింది. కనకయ్య మృతదేహం లారీ చక్రం కింద ఇరుక్కుపోయింది. మృతదేహాన్ని బయటకు తీయడం కోసం రెండు క్రేన్లు సహకారం తీసుకోవాల్సి వచ్చిందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.