లాక్ డౌన్ కష్టాలు : చలించిపోయిన కేటీఆర్..ట్రాలీ ఆటోలో...
మంత్రి కేటీఆర్ ఆకస్మిక పర్యటనలో భాగంగా ట్యాంక్‌బండ్ సమీపంలో మండుటెండలో నడుచుకుంటూ వెళుతున్న కొంత మందిని గమనించారు.
మంత్రి కేటీఆర్ ఆకస్మిక పర్యటనలో భాగంగా ట్యాంక్‌బండ్ సమీపంలో మండుటెండలో నడుచుకుంటూ వెళుతున్న కొంత మందిని గమనించారు. వెంటనే కారు ఆపి ఎక్కడకి వెడుతున్నారని కనుక్కున్నారు. తమది నల్గొండ అని పనికోసం నగరానికి వచ్చామని, లాక్‌డౌన్‌తో పనులు లేకపోవడంతో నడుచుకుంటూ వెళుతున్నట్లుగా చెప్పారు. దీనిపై చలించిపోయిన కేటీఆర్ వారిని తుంగతుర్తి దాకా దిగబెట్టేందుకు అప్పటికప్పుడు ఏర్పాట్లు చేయించారు. సరకులు తరలించే ఓ ట్రాలీ ఆటోలో వారు సొంతూరికి పంపించారు.