టిఆర్ఎస్ సోషల్ మీడియా విషప్రచారం వల్లే మా ఓటమి : కిషన్ రెడ్డి (వీడియో)
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ ఓటమికి టీఆర్ఎస్ సోషల్ మీడియా విషప్రచారమే కారణమని కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ సోషల్ మీడియా తమ మీద లేనిపోని విషాన్ని చిమ్మిందని చెప్పుకొచ్చారు.

కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘కేవలం సోషల్ మీడియా ద్వారా మాపై విష ప్రచారం చేశారు. 10 వేల వరద సహాయం విషయంలో సోషల్ మీడియా విష ప్రచారం చేసింది. వరదసాయం ఇవ్వద్దని మేము లేఖ రాసినట్టుగా అబద్దపు ప్రచారం చేసింది. అందువల్ల మా సీట్లు కొన్ని తగ్గాయి.
మేము ఆంధ్రా వారిని తిట్టినట్టుగా కూడా ప్రచారం చేశారు. సోషల్ మీడియా ద్వారా మాపై గన్నుపెట్టి మమ్మల్నేకాల్చే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియా తప్పుడు ప్రచారం ద్వారా చివరకు ఆంధ్ర రాయలసీమ ఓటర్లను కూడా మా నుండి తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఇదంతా ముమ్మాటికీ టిఆర్ఎస్ కుట్ర.’ అని అన్నారు.