కేసీఆర్ కు కరోనా... ఏడుపాయల దుర్గమ్మకు ఎమ్మెల్సీ శేరి ప్రత్యేకపూజలు
మెదక్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాబారినుండి సురక్షితంగా బయటపడాలంటూ టీఆర్ఎస్ నాయకులు
మెదక్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాబారినుండి సురక్షితంగా బయటపడాలంటూ టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు, మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్నారు. ఇలా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కూడా కేసీఆర్ పేరిట ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా మహమ్మారి నుండి కేసీఆర్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో పరిపాలన చేపట్టాలని సుభాష్ రెడ్డి దుర్గమ్మను కోరుకున్నారు.