బ్రేకింగ్.. సర్పంచ్ లతో కేసీఆర్ ఫోన్ సంభాషణ...
కాళేశ్వరం నీళ్లు అందని , వరద కాలువకు మీదున్న గ్రామాలకు నీటి కవరేజీ లేదని అక్కడి నేతలు చేసిన విజ్ఞప్తికి కేసీఆర్ స్పందించారు.
కాళేశ్వరం నీళ్లు అందని , వరద కాలువకు మీదున్న గ్రామాలకు నీటి కవరేజీ లేదని అక్కడి నేతలు చేసిన విజ్ఞప్తికి కేసీఆర్ స్పందించారు. కథలపూర్ ZPTC నాగం భూమయ్య, మెడిపెల్లి మండల్ వెంకట్రావ్ పేట మాజీ సర్పంచ్ శ్రీపాల్ రెడ్డి తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ లో మాట్లాడారు. నీళ్లకోసం ప్రత్యామ్నాయ వరద కాలువ నిర్మాణం చేద్దామని అన్నారు. కేసీఆర్ కనిపించడం లేదన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ఆడియో సంభాషణ ప్రాముఖ్యత సంతరించుకుంది.