Asianet News TeluguAsianet News Telugu

KCR Birtday: కేసీఆర్ కు అదిరిపోయే భర్త్ డే గిఫ్ట్... అద్భుతానికి హీరో నాగార్జున శ్రీకారం

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున సినీ హీరో అక్కినేని నాగార్జున పర్యావరణాన్ని కాపాడే అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున సినీ హీరో అక్కినేని నాగార్జున పర్యావరణాన్ని కాపాడే అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల ప్రకటించినట్లుగానే వేయి ఎకరాలకు పైగా అటవీ భూమి దత్తత తీసుకున్న నాగార్జున మాట నిలబెట్టుకున్నారు.  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో 1080 ఎకరాల అటవీ భూమిని తీసుకుంటున్నట్లు నాగార్జున ప్రకటించారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు పేరు మీద  హైదరాబాద్ శివారు చెంగిచర్ల అటవీ ప్రాంతంలో అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి నాగార్జున శంకుస్థాపన చేసారు. హరిత నిధి (గ్రీన్ ఫండ్)కి రెండు కోట్ల రూపాయల చెక్ కు అటవీ శాఖ ఉన్నతాధికారులకు అందించి రీల్ హీరో కాదు రియల్ లైఫ్ లోనూ హీరోనే అని చాటారు నాగార్జున.

Video Top Stories