48 గంటల్లో కవిత అరెస్ట్ ఖాయం.. కేసీఆర్ పతనానికి ఇదే నాంది..: కేఏ పాల్
హైదరాబాద్ :తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టవడం ఖాయమని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు.
హైదరాబాద్ :తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టవడం ఖాయమని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. మార్చి 10న(ఎల్లుండి శుక్రవారం) కవిత అరెస్టు కేసీఆర్ పతనానికి ఆరంభం మాత్రమేనని అన్నారు. తెలంగాణ రైతులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల కన్నీరు, వీరులు శూరుల ఉసురు కేసీఆర్ కుటుంబానికి తాకిందని అన్నారు. దేవుడినే శతృవును చేసుకున్న కేసీఆర్ ఫలితం అనుభవిస్తాడని కేఏ పాల్ అన్నారు. అయితే కవిత అరెస్ట్ ఖాయమంటూ వీడియో చిత్రీకరించే సమయంలో పాల్ విచిత్రమైన వేషధారణలో కనిపించారు. వీడియోలో కనిపించేంత వరకే పైజామా ధరించిన పాల్ కింద ప్యాంట్ లేకుండా కనిపించాడు. వీడియో చిత్రీకరణకు ఏదో అంతరాయం కలగ్గా సరిచేసే సమయంలో పాల్ అసలురూపం బయటపడింది.