Asianet News TeluguAsianet News Telugu

రామగుండంలో అనాథ పిల్లలకు ఘనంగా సామూహిక కర్ణ వేదన మహోత్సవం

పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న తబితా అనాథ పిల్లల సంరక్షణ కేంద్రంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో సామూహిక కర్ణ వేదన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. 

పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న తబితా అనాథ పిల్లల సంరక్షణ కేంద్రంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో సామూహిక కర్ణ వేదన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులు లేరనే ఆలోచన రాకుండా అందరూ ఆత్మీయులే అనే భావంతో సొసైటీ వ్యవస్థాపకులు మద్దెల దినేష్ సారధ్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఇందుకు సంబంధించి కోల్ బెల్ట్ ప్రాంతంలోని పలు స్వచ్ఛంద, సామాజిక సేవా సంస్థలు అండగా నిలిచాయి.  సాంప్రదాయ బద్దంగా పిల్లలకు కర్ణ వేదన  కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమానికి సహకరించిన అన్ని స్వచ్ఛంద సంస్థలు, వాటి ప్రతినిధులకు మద్దెల దినేష్ కృతజ్ఞతలు తెలిపారు.