బండి సంజయ్ పై దేశద్రోహం కేసులు..: కరీంనగర్ పోలీసులకు కార్పోరేటర్ ఫిర్యాదు

కరీంనగర్ : తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పై కరీంనగర్ 49వ డివిజన్ బిఆర్ఎస్ కార్పోరేటర్ సోహన్ సింగ్ కమల్జిత్ కౌర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. 

First Published Feb 12, 2023, 1:27 PM IST | Last Updated Feb 12, 2023, 1:27 PM IST

కరీంనగర్ : తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పై కరీంనగర్ 49వ డివిజన్ బిఆర్ఎస్ కార్పోరేటర్ సోహన్ సింగ్ కమల్జిత్ కౌర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ప్రభుత్వం కొత్తగా కట్టిన సచివాలయ భవన గోపురాలను (టూంబ్స్) కూలగొడతామంటూ సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు భర్తతో కలిసి వెళ్లి ఫిర్యాదు చేసారు కార్పోరేటర్. పచ్చని తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందకు ప్రయత్నిస్తున్న బండి సంజయ్ పై దేశద్రోహం, క్రిమినల్ కేసులు పెట్టాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం మానేయాలని బండి సంజయ్ కు బిఆర్ఎస్ నేత హెచ్చరించారు.