భయంతో వదిలేయడం వల్లే చిన్నారి చనిపోయింది : జూబిలీహిల్స్ ప్రమాదం పై ఎమ్మెల్యే షకీల్
జూబ్లీ హిల్స్ ప్రమాదానికి కారణమైన కారు తనది కాదని బోధన్ ఎమ్మెల్యే షకీల్ తేల్చి చెప్పారు.
జూబ్లీ హిల్స్ ప్రమాదానికి కారణమైన కారు తనది కాదని బోధన్ ఎమ్మెల్యే షకీల్ తేల్చి చెప్పారు. ఈ కారు తన కజిన్ మీర్జా ది అని షకీల్ తెలిపారు. శుక్రవారం నాడు ఈ ప్రమాదంపై ఎమ్మెల్యే షకీల్ ఓ వీడియో సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు. జూబ్లీహిల్స్ లో ప్రమాదానికి కారణమైన కారుకు బోధన్ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది. అప్పుడప్పుడూ ఈ కారును తాను ఉపయోగిస్తానని బోధన్ ఎమ్మెల్యే షకీల్ చెప్పారు. ఈ కారణంతోనే తాను ఈ కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించినట్టుగా చెప్పారు. ఈ ప్రమాదం గురించి తాను తన కజిన్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకొన్నానని ఆయన వివరించారు. ప్రమాదం జరిగిన సమయంలో భయంతోనే తన చేతిలోని బిడ్డను మహిళ వదిలేసిందని షకీల్ చెప్పారు. ఆ మహిళ బిడ్డను వదిలేయడంతోనే ఆ చిన్నారి చనిపోయినట్టుగా షకీల్ వివరించారు.