జూబ్లీహిల్స్ లో రేవ్ పార్టీలు, అశ్లీల నృత్యాలు... పబ్ ఎదుట కాలనీవాసుల ఆందోళన

హైదరాబాద్: జనావాసాల మధ్యలో నిర్వహిస్తున్న పబ్ వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ జూబ్లీహిల్స్ వాసులు ఆందోళనకు దిగారు. జూబ్లీహిల్స్ లోని టాట్ పబ్ పై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని... అందువల్లే తాము పబ్ ముందు ఆందోళనకు దిగినట్లు కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. రాత్రిళ్ళు రెండు మూడు వరకు పబ్ లో మ్యూజిక్ సిస్టమ్, యువత అసభ్యకర ప్రవర్తన తీవ్ర సమస్యగా మారిందంటూ ఆందోళన వ్యక్తం చేసారు. గతంలో టాట్ పబ్ లో రేవ్ పార్టీలు, అసభ్యకర నృత్యాలతో పాటు పలు కేసులు వున్నట్లు స్థానికులు గుర్తుచేసారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన ఎక్సైజ్ పోలీసులు, లోకల్ పోలీసులు పట్టించుకోవడం లేదని  అవేదన వ్యక్తం చేసారు. వెంటనే పబ్ ను ఇక్కడి నుండి తీసివేయాలని స్థానికులు ఆందోళన వ్యక్తం చేసారు. 
 
First Published Dec 17, 2021, 4:59 PM IST | Last Updated Dec 17, 2021, 4:59 PM IST