భార్యతో కలిసి గార్డెనింగ్ చేస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
ప్రధాని పిలుపు మేరకు దేశం మొత్తం జనతా కర్ఫ్యూ పాటిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రధాని పిలుపు మేరకు దేశం మొత్తం జనతా కర్ఫ్యూ పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం ఏడు గంటల నుంచి ఇళ్లకే పరిమితమైన ప్రజలు కుటుంబసభ్యులతో గడుపుతున్నారు. మరోవైపు నిత్యం రాజకీయాలు, ఎత్తులు, పై ఎత్తులతో క్షణం తీరిక లేకుండా గడిపే రాజకీయ నాయకులు సైతం ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి గార్డెనింగ్ చేశారు. ఇంటి ఆవరణలోని మొక్కలను పరిశీలిస్తూ, వాటికి పెరుగుదలకు సూచనలు చేశారు.