శభాష్ పోలీస్... అదృశ్యమైన యువతిని 48 గంటల్లోపే..

వ్యక్తిగత కారణాలతో ఇంటి నుండి అదృశ్యమైన యువతిని టెక్నాలజీ సహాయంతో 48 గంటల వ్యవధిలో గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు జమ్మికుంట పోలీసులు. 
 
First Published Nov 20, 2020, 1:33 PM IST | Last Updated Nov 20, 2020, 1:33 PM IST

వ్యక్తిగత కారణాలతో ఇంటి నుండి అదృశ్యమైన యువతిని టెక్నాలజీ సహాయంతో 48 గంటల వ్యవధిలో గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు జమ్మికుంట పోలీసులు. 
జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామానికి చెందిన యువతి (19) మంగళవారం నాడు ఇంటినుండి అదృశ్యమైంది. ఈ విషయాన్ని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు టెక్నాలజీ ఆధారంగా సదరు బాలికను గురువారంనాడు కరీంనగర్లో గుర్తించారు.