జలదీక్ష : కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హౌజ్ అరెస్ట్...

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా నేడు జూన్ 2న కాంగ్రెస్ నేతలు జల దీక్ష చేపట్టాలని నిర్ణయించగా.. పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు.

First Published Jun 2, 2020, 10:42 AM IST | Last Updated Jun 2, 2020, 10:42 AM IST

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా నేడు జూన్ 2న కాంగ్రెస్ నేతలు జల దీక్ష చేపట్టాలని నిర్ణయించగా.. పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. కృష్ణా నదిపై పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నిలదీస్తూ.. నిరసన దీక్షలు చేపట్టడానికి సమాయత్తం అయిన హస్తం 
పార్టీ నేతలను ఇళ్ల నుంచి కదలకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే, ఎసిసి కార్యదర్శి సంపత్ కుమార్‌ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నేతల నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. జలదీక్షకు ముందుగా అనుమతి ఇచ్చి ఇప్పుడు అదుపులోకి తీసుకుంటుండటం పట్ల కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జల దీక్ష చేపట్టాలని నిర్ణయించారు.