పన్ను కట్టలేదని ఇంటిముందే చెత్తపోసి... జగిత్యాలలో మున్సిపల్ సిబ్బంది నిర్వాకం
జగిత్యాల: చాలాకాలంగా పన్ను చెల్లించడంలేదంటూ ఓ ఇంటిముందు మున్సిపల్ అధికారులుకారులు చెత్త పోయించిన ఘటన జగిత్యాల పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని పురాణిపేటకు చెందిన హైమద్ బిన్ సాలెం చాలాకాలంగా property tax చెల్లింకపోవడంతో అదికాస్తా లక్ష రూపాయలకు చేరుకుంది. ఈ మొత్తాన్ని చెల్లించాలంటూ ఇటీవల పలుమార్లు మున్సిపల్ అధికారులు కోరినా హైమద్ స్పందించడంలేదు. దీంతో మున్సిపల్ అధికారుల ఆదేశాలతో పారిశుద్ద్య సిబ్బంది అతడి ఇంటిముందు చెత్త పోసారు. ఇదేంటని సిబ్బందిని హైమద్ నిలదీయగా అధికారులు చెప్పడంతో చేసామని చెప్పారు. అధికారులు కూడా అక్కడికి చేరుకోవడంతో వారితో ఇంటి యజమాని వాగ్వాదానికి దిగారు.